NTV Telugu Site icon

Shah Rukh Khan : షిరిడి సాయిబాబా మందిరంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్..

Sharukh (5)

Sharukh (5)

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. తాజాగా డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో షారుఖ్ ఒకవైపు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఆలయాలను సందర్శిస్తున్నాడు.. మొన్న అమ్మవారిని దర్శించుకున్న షారుఖ్.. ఇప్పుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

సాయిబాబా మందిరానికి తన ముద్దులకూతురు సుహానాతో కలిసి వెళ్లారు.. మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన ఇలాగే వైష్ణోదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. డ్రామా, రొమాన్స్ జానర్‌లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ సినిమా తెరకేక్కుతుంది. ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు..

ఇకపోతే హిరానీ, గౌరీ ఖాన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. మరి బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి… ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..