Site icon NTV Telugu

King: దేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ చిత్రంగా “కింగ్”..! బడ్జెట్‌ ఎంతో తెలుసా..?

King

King

King: షారుఖ్ ఖాన్ ప్రముఖ పాత్రలో నటించిన “కింగ్” టీజర్ నవంబర్ 2న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పలు నివేదికల ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లకు (సుమారు $3.5 బిలియన్లు) చేరుకుంది. షారుఖ్ ఖాన్, అతని బృందం ప్రమోషన్, ఇతర ఖర్చులు కాకుండా రూ. 350 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దీనితో “కింగ్” ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ యాక్షన్ చిత్రంగా నిలిచింది.

READ MORE: CM Chandrababu : సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుంది

“కింగ్” మొదట్లో ఒక చిన్న యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రారంభమైంది. ఇందులో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడు. ఆ సమయంలో ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. అప్పట్లో దీని బడ్జెట్ సుమారు రూ.150 కోట్లు (సుమారు $1.5 బిలియన్లు). అయితే.. కథను మరింత విస్తరించారు. అనంతరం సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్‌లో చేరి.. మొత్తం స్క్రిప్ట్‌ను షారుఖ్ ఖాన్‌తో తిరిగి డిజైన్ చేశాడు. భారతీయ సినిమాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి షారుఖ్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. సిద్ధార్థ్ రూ.350 కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఒక విజన్‌ను అందించాడు. షారుఖ్ ఖాన్ కూడా అతడి ఆలోచన, భారీ బడ్జెట్‌ను చూసి ఆశ్చర్యపోయాడని, వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు.

Exit mobile version