NTV Telugu Site icon

Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!

Shah Rukh Khan Gold Coin

Shah Rukh Khan Gold Coin

Grevin Museum honours Shah Rukh Khan with Gold Coin: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం.. బంగారు నాణెంతో షారుఖ్‌ను సత్కరించింది. పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ విడుదల చేసిన నాణెంపై షారుఖ్‌ చిత్రం, పేరు ఉండడం విశేషం. ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు షారుఖ్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదలైంది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖానే. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు బాద్‌షా కావడం విశేషం. భారతీయ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా మూడు దశాబ్ధాలకు పైగా షారుఖ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

సుజయ్ ఘోష్ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాద్‌షా కూతురు సుహానా ఖాన్ ఒక కీలక పాత్రలో నటించనుందని టాక్. అంతేకాదు అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జవాన్, పఠాన్, డంకీ సినిమాలతో షారుఖ్‌ భారీ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే.

Show comments