Site icon NTV Telugu

Shah Rukh Khan: నిన్ను ఆ జెర్సీలో తప్ప మరోదానిలో చూడలేను.. షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్..!

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్, ఆండ్రే రస్సెల్‌కి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో 12 సీజన్ల పాటు ‘పర్పుల్ అండ్ గోల్డ్’ జెర్సీలో మెరిసిన రస్సెల్ ఆదివారం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. 2026 సీజన్‌కు ‘పవర్ కోచ్’గా కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నట్లు రస్సెల్ ప్రకటించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగే ఇతర టీ20 లీగ్‌లలో మాత్రం తాను కొనసాగుతానని తెలిపారు.

Sridhar Babu : 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం

ఇక రస్సెల్‌ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే షారుక్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. అద్భుతమైన జ్ఞాపకాలకు థాంక్యూ ఆండ్రే… మా నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్! @KKRiders కోసం చేసిన నీ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు స్పోర్ట్స్‌మన్‌గా నీ ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. పవర్ కోచ్‌గా మా యువ క్రీడాకారులకు నీ అనుభవం, నీ శక్తి, నీ పంచ్ నేర్పించబోతున్నావు. పర్పుల్ అండ్ గోల్డ్ తప్ప ఏ జెర్సీలో నిన్ను ఊహించలేం. మసిల్ రస్సెల్ ఫర్ లైఫ్! టీమ్, అభిమానులందరి తరఫున నీకు ప్రేమతో అని షారుక్ రాసుకో వచ్చాడు.

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!

2012లో మొదటిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రస్సెల్.. తొలి రెండు సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడారు. ఆ తరువాత కేకేఆర్‌తో జతకట్టి తన ప్రతిభను చూపించి, టీమ్‌కు అనేక విజయాలు అందించారు. భారీ హిట్టింగ్, కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం… ఈ రెండు లక్షణాలతో రస్సెల్ ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపును పొందారు. మొత్తం 140 మ్యాచ్‌ల్లో 2,651 పరుగులు సాధించిన రస్సెల్ 174.18 స్ట్రైక్‌రేట్‌తో 12 అర్ధశతకాలు నమోదు చేశారు. బౌలింగ్‌లో 123 వికెట్లు తన ఖాతాలో వేసుకుని, 9.51 ఎకానమీ రేట్‌తో ఒక ఫైవ్ వికెట్ కూడా తీసుకున్నారు.

Exit mobile version