Bollywood Hero Shah Rukh Khan Pose with ODI World Cup 2023 Trophy: భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సమరం మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
ప్రపంచకప్ 2023 ట్రోఫీని ఐసీసీ చారిత్రాత్మకంగా ప్రారంభించింది. మెగా ట్రోఫీని అంతరిక్షంలో నుంచి ప్రారంభించారు. ప్రపంచకప్ ట్రోఫీ ప్రస్తుతం వరల్డ్ టూర్‌లో ఉంది. టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని దేశాలలో ట్రోఫీ సందర్శన ఉంటుంది. ప్రపంచకప్ ప్రమోషన్స్‌లో భాగంగా ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటో పంచుకుంది. ఇందులో బాలీవుడ్ బాడ్ షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. ప్రపంచకప్ 2023 ట్రోఫీతో షారుఖ్ ఖాన్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: IND vs WI: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. 100లో అయినా పోటీ ఉంటుందా?
ప్రపంచకప్ 2023 ట్రోఫీని షారుఖ్ ఖాన్ చూస్తున్న ఫొటోను ఐసీసీ షేర్ చేసింది. ‘కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేతిలో వన్డే ప్రపంచకప్ ట్రోఫీ.. మరింత దగ్గరగా’ అని ఐసీసీ క్యాప్షన్‌లో పేర్కొంది. ఐసీసీ షేర్ చేసిన 30 నిమిషాల్లోనే ఈ పోస్ట్ 1 లక్షా 50 వేలకు పైగా లైక్‌లను పొందినది. ఈ ట్వీట్ చూసిన ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఐసీసీ కేవలం దీన్ని ఓ సాధారణ పోస్టులా చేసి ఇతర దేశాలకు వార్నింగ్ ఇచ్చిందని’, ‘మ్యాటర్ ఏంటి’, ‘ఇప్పుడు ప్రపంచకప్ గెలవకుండా భారత్‌ను ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
King Khan 🤝 #CWC23 Trophy
It’s nearly here … pic.twitter.com/TK55V3VkfA
— ICC (@ICC) July 19, 2023