Site icon NTV Telugu

Happy Birthday Shahrukh Khan: నేటితో షారుఖ్‌ఖాన్‌కి 60 ఏళ్లు.. తన ఫిట్‌నెస్ రసహ్యం పంచుకున్న బాలీవుడ్ బాద్షా..

Shahrukh Khan

Shahrukh Khan

Happy Birthday Shahrukh Khan: నేడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. నవంబర్ 2న తన 60వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నిన్న రాత్రి నుంచి తన ఇంటి వద్దకు అభిమానులు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన సాయంత్రం 4 గంటలకు బాంద్రాలోని బాల గంధర్వ రంగమందిర్‌లో అభిమానులతో ప్రత్యేక సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షారుఖ్‌ 60 ఏళ్ల వయసులో సైతం ఫిట్‌గా కనిపిస్తారు. ముఖంలో వయసు తాలూకు ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇప్పటికీ సిక్స్‌ప్యాక్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తారు. అయితే.. ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని షారూఖ్ వెల్లడించారు. ధూమపానం మానేసినప్పటి నుంచి తన ఆరోగ్యంలో పాజిటివ్‌ మార్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

READ MORE: INDW vs SAW: నేడే మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?

“నేను రోజూ రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తా. చిరుతిళ్ల జోలికి అస్సలు వెళ్లను. ఆహారంలో కూడా తృణధాన్యాలు, గ్రిల్డ్‌ చికెన్‌, బ్రోకోలి, పప్పుతో చేసే కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. భోజనం చాలా సింపుల్‌గా ఉంటేనే ఇష్టపడతా” అని చెప్పారు. అయితే ఎక్కడికైనా అతిథిగా వెళ్లినప్పుడు మాత్రం వారు ఆఫర్‌ చేసినవన్నీ వొద్దనకుంటా ఆరగిస్తానని, ఆతిథ్యం స్వీకరించినప్పుడు ఇతరులను నొప్పించడం సరికాదని షారుఖ్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా తాను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతానని, షూటింగ్‌ ముగించుకొని ఎంత రాత్రి ఇంటికొచ్చినా ఓ గంట సేపు వర్కవుట్స్‌ చేశాకే నిద్రకు ఉపక్రమిస్తానని షారుఖ్‌ తెలిపారు. మితాహారం తీసుకుంటూ, వారానికి నాలుగైదుసార్లు వర్కవుట్స్‌ మీద దృష్టిపెడితే వయసును దాచడం ఎవరికైనా పెద్ద సమస్యకాదని ఆయన వెల్లడించారు.

READ MORE:Vikarabad: దారుణం.. భార్య, కూతురు, వదినను నరికి చంపిన వ్యక్తి.. ఆపై తానూ ఆత్మహత్య..

Exit mobile version