Shafali Verma Century: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసింది షఫాలీ. దీనితో షఫాలీ అంతర్జాతీయ వైట్ బాల్ క్రికెట్‌లో తన తొలి సెంచరీ నమోదు చేసుకుంది.
షఫాలీ వర్మ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాదింది. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉండేది. హర్మన్‌ప్రీత్ 8 సిక్సర్ల రికార్డును షఫాలీ అధిగమించింది.
ఈ సెంచరీతో పాటు షఫాలీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 100 సిక్సర్లతో ఉన్న స్మృతి మంధానను వెనక్కి నెట్టి షఫాలీ 104 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన కూడా రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్‌పై 37 పరుగులు చేయడంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 4,788 పరుగులతో మంధాన.. న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ 4,758 పరుగుల రికార్డును అధిగమించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 49 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమెకు తోడుగా హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులు చేయగా, స్మృతి మంధాన 19 బంతుల్లో 37 పరుగులు చేసింది. చివర్లో భారతి ఫుల్మాలి 5 బంతుల్లో 9 పరుగులు చేయడంతో భారత్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్ 196 పరుగులు చేయాల్సి ఉంది.
𝙒𝙝𝙚𝙣 𝙩𝙝𝙚 𝙨𝙩𝙖𝙠𝙚𝙨 𝙖𝙧𝙚 𝙝𝙞𝙜𝙝𝙚𝙨𝙩, 𝙩𝙝𝙚 𝙗𝙧𝙞𝙜𝙝𝙩𝙚𝙨𝙩 𝙨𝙩𝙖𝙧𝙨 𝙨𝙝𝙞𝙣𝙚 ⭐
📸 @TheShafaliVerma realises a dream in the #AsianGames Semi-Final 💯
Updates ▶️ https://t.co/zMJKYRAVhE#TeamIndia pic.twitter.com/y9t56uyc47
— BCCI Women (@BCCIWomen) September 20, 2026

