Shabbir Ali : ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక.. మన దేశానికి లాభం అని అనుకున్నారని, 104 మందిని నిన్న దేశానికి పంపించారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. జనవరి నుండి… అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని పంపిస్తాం అంటూనే ఉన్నారని, కానీ కేంద్రం అసలు.. దీనిపై మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెరికా నుండి చేతులు..కాళ్ళు కట్టేసి తెచ్చారని, వాళ్ళను కనీసం ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకోలేదని ఆయన మండిపడ్డారు.
KTR : బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ.. పిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా?
మోడీ అంటే విశ్వగురు అని చెప్పుకునే బీజేపీ నేతలు.. 104 మందిని అమెరికా వెనక్కి పంపితే మోడీ ఎందుకు మాట్లాడటం లేదని, కనీసం అమెరికా ఎంబసీతో.. మన ఎంబసీ కనీసం మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు. 2008లో గల్ఫ్ నుండి 44 వేల మందిని మేము తీసుకువచ్చామని, దుబాయ్ లో ఇండియా ప్రభుత్వం 10 వేల ఖర్చుతోనే తీసుకు వచ్చాం.. డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మోడీ విశ్వగురు కనీసం ఎందుకు పట్టించుకోవడం లేదని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫెయిల్ అయ్యారని షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. అమెరికాతో మాట్లాడే దమ్మూ కేంద్రానికి లేదని, ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు.
AP Budget Session: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..