Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabari Floods: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శబరి నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకోగా, కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు పెరిగింది. పలు వాగులు పొంగిపొర్లడంతో రహదారులపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం జిల్లాలోని శబరి నదిలో వరద ప్రవాహం ఉధృతమైంది. బలిమెల, సీలేరు, డొంకరాయి జలాశయాల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 41 అడుగులకు చేరగా, శబరి ఒడ్డున ఉన్న ఇళ్లు, దుకాణాల వద్దకు వరద నీరు చేరింది. పలు వాగులు పొంగిపొర్లడంతో కొన్ని రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో 10 కట్ఆఫ్ పాయింట్లను అధికారులు గుర్తించారు. కూనవరం మండలంలో 2, వీఆర్‌పురం మండలంలో 2, చింతూరు మండలంలో 6 కట్ఆఫ్ పాయింట్ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
వరద పరిస్థితులను ఇన్చార్జ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, ఐటిడిఏ పీవో శుభం నోక్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూనవరం-వీఆర్‌పురం సంగమం ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. 2022 వరదలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా చింతూరు మండలంలోని ఏజీ కోడేరు గ్రామం నుంచి 47 కుటుంబాలను, శబరి ఒడ్డున నివసిస్తున్న 23 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 300 కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగు మండలాల్లో 105 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ఆహారం, తాగునీరు, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. కట్ఆఫ్ పాయింట్ల వద్ద ఐదు మోటార్ పడవలను సిద్ధంగా ఉంచి అవసరమైన సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే నాలుగు మండలాల పరిధిలోని 10 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులకు తరలించి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. శబరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వరద పరిస్థితులపై జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!