NTV Telugu Site icon

Sexual Assault : సుల్తాన్ బజార్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి

Minor Rape

Minor Rape

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మాదా హరికృష్ణ (27) అనే వ్యక్తి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్ బజార్ ఏసిపి శంకర్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లాకు చెందిన హరి కృష్ణ (30) ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను మాయ మాటలతో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువెళ్లి హనుమాన్ మందిరంలో పెళ్లి చేసుకున్నాడు.

 

అనంతరం ఓ లాడ్జి కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇతనికి ఇంతక ముందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలించి విశ్వసనీయ సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న హరికృష్ణను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి. ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.