Site icon NTV Telugu

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ తల్లి పరారీ.. వెనుదిరిగిన సిట్!

Prajval

Prajval

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో శుక్రవారం ప్రజల్వ్ తల్లికి దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. కానీ శనివారం ఇంటికెళ్లిన సిట్ బృందానికి షాక్ తగలింది. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ ఇంట్లో అందుబాటులో లేరు. ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు బృందం వెనుదిరిగినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Nikhil Swayambhu: ‘స్వయంభూ’ కోసం రంగంలోకి సెంథిల్ కుమార్..

రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్‌ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో ఉండాలని తెలిపింది. అయితే ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు షికార్లు చేశాయి. దీంతో శనివారం ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Fake Seeds: భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ అభ్యర్థిగా హాసన్ నుంచి బరిలోకి దిగారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే.. ప్రజ్వల్‌కు చెందిన లైంగిక వేధింపుల వీడియోలు బయటకు వచ్చాయి. అప్పటికే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడు. ఇక ఆయన తండ్రి రేవణ్ణపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ప్రజ్వల్‌ను లొంగిపోవాలని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామును కర్ణాటకకు చేరుకున్న ప్రజ్వల్‌ను సిట్ బృందం అరెస్ట్ చేసింది. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా జూన్ 6 వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. ఇక ప్రజ్వల్‌కు చెందిన మొబైల్ కనిపించడం లేదు. దీంతో మొబైల్ గుర్తించేందుకు సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి: Heavy rain: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ లిస్టు విడుదల

Exit mobile version