AP Weather: ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (47):-
శ్రీకాకుళం 11 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13 , అనకాపల్లి కె.కోటపాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Read Also: Kesineni Nani: పార్టీ లైన్‌లో గతంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశా..
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(151):-
శ్రీకాకుళం15 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 5, ఎన్టీఆర్ 6, గుంటూరు 6, పల్నాడు 13, బాపట్ల 1, ప్రకాశం 9, తిరుపతి 2, అనంతపురం 2, అన్నమయ్య 1, నెల్లూరు1, సత్యసాయి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,98 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.