NTV Telugu Site icon

Vizag Road Accident: స్కూల్‌ ఆటోను ఢీకొట్టిన లారీ.. రోడ్డుపై పల్టీలు కొట్టింది..!

Vizag Road Accident

Vizag Road Accident

Vizag Road Accident: విశాఖపట్నంలో స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురయ్యాయి. వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 20 మంది స్కూల్‌ విద్యార్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.. సంగం శరత్ థియేటర్ కూడలిలో స్కూల్ ఆటోను లారీని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఓ వైపు లారీ వేగంగా వస్తుండగా.. మరోవైపు, ఆటో డ్రైవర్‌ కూడా అంతే వేగంతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.. లారీ దూసుకురావడంతో.. ఆటో కంట్రోల్ చేయలేక లేరుగా వెళ్లి ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బేతనీ స్కూల్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన దెబ్బ తగిలిన ఇద్దరు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇక, మధురవాడ, నగరపాలెం దగ్గర మరో స్కూల్ ఆటో బోల్తా పడింది. పందులు అడ్డుగా రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలకు దెబ్బలు తగిలాయి. వీరంతా భాష్యం స్కూల్ విద్యార్థులుగా చెబుతున్నారు స్థానికులు.. ఒకే రోజు రెండు చోట్ల అది కూడా స్కూల్‌ ఆటోలు ప్రమాదాలకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

Read Also: Akhilesh Yadav-World Cup 2023: అక్కడ ఆడితే భారత్ ప్రపంచకప్‌ గెలిచేది.. అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!