NTV Telugu Site icon

AP News: పలువురు కీలక పోలీస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు..

Ec

Ec

ఏపీలో పలువురు కీలక పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటికే.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా మరో ఇద్దరిని బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, బెజవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో.. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పీఎస్సార్, బెజవాడ సీపీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ఈసీ వేటు వేసిన ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల విధులు అప్పగించొద్దని స్పష్టం చేసింది.

Read Also: CSK vs LSG: చెన్నై భారీ స్కోరు.. సెంచరీతో చెలరేగిన గైక్వాడ్

ఇటీవల సీఎం జగన్ పై దాడి విషయంలో భద్రతా వైఫల్యం, ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ ఈ చర్యలు తీసుకుంంది. ఇంటెలిజెన్స్ చీఫ్, బెజవాడ సీపీగా ఎవర్ని నియమించాలనే అంశంపై రేపు మధ్యాహ్నాం 3 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని ఈసీ తెలిపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా పంపాలని సూచించింది. ప్రతిపాదిత అధికారులకు చెందిన గత ఐదేళ్ల కాలంలోని పనితీరు నివేదికలు, విజిలెన్స్ క్లియరెన్సులను పంపాలని ఈసీ ఆదేశం ఇచ్చింది.

Read Also: Rishi Sunak: రువాండా బిల్లుకు బ్రిటన్ ఆమోదం.. ఐరాస ఆందోళన