NTV Telugu Site icon

Kuwait fire: 49కి చేరిన మృతుల సంఖ్య.. మరో 40 మంది ఆస్పత్రిలో చికిత్స

F 2

F 2

కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 49కి చేరింది. బుధవారం తెల్లవారుజామున 10 అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సంఘటనాస్థలిలో 40 మంది భారతీయులు సజీవదహనం కాగా.. మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. మొత్తం భారతీయులతో సహా మిగతా మృతుల సంఖ్య 49కి చేరింది. మరో 40 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. తొలుత కిచెన్‌లో మొదలైన మంటలు.. క్రమక్రమంగా బిల్డింగ్‌ అంతా వ్యాపించాయి. కొంత మంది ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఐదో అంతస్తు నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకే కంపెనీకి చెందిన 160 మంది కార్మికులు ఈ బిల్డింగ్‌లో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: Aadhaar Ration Card Link: ఆధార్, రేషన్ కార్డు లింక్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  IND vs USA T20 WC Pitch Report: నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పిచ్.. ఎవరికి అనుకూలం