Site icon NTV Telugu

Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!

Jawahar Navodaya

Jawahar Navodaya

Jawahar Navodaya: తెలంగాణలో కొత్తగా మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ప్రారంభానికి సంబంధించి తాజాగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి (NVS) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుండి ఉపాయుక్తులు శ్రీ టి. గోపాల్ కృష్ణ, టి. సూర్యప్రకాశ్, బి. చక్రపాణి హాజరయ్యారు. అలాగే పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read Also: Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్

ఈ సమీక్ష సమావేశంలో విద్యాలయాల భౌతిక సదుపాయాలు సిద్ధం చేయడం, సిబ్బంది నియామకం, విద్యా ప్రణాళికలు, జిల్లాల అధికారులతో సమన్వయం వంటి విషయాలపై చర్చించారు. విద్యాశాఖ కార్యదర్శి అన్ని ఏర్పాట్లు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా మంజూరైన భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌ నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాలు జూలై 14, 2025 నుండి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

Read Also: Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు అవుతున్నాయి. విద్యాలయాల ప్రారంభం మాత్రమే కాకుండా, విద్యార్థులకు స్వాగతించదగిన, అనుకూల విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగుతుంది.

Exit mobile version