Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భాజపా ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు పంజాబ్-హర్యానా హైకోర్టులో ఓ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై ఉన్న డిఫమేషన్ కేసును రద్దు చేయాలంటూ ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనలకు సంబంధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కిసాన్ ఆందోళన జరుగుతుంది. అదే సమయంలో కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో బతిండా జిల్లా బహదూర్‌గఢ్ జండియా గ్రామానికి చెందిన మహిందర్ కౌర్ అనే 87 ఏళ్ల వృద్ధ మహిళను 200 రూపాయలు తీసుకుని ఆందోళనకు వచ్చిన మహిళగా అభివర్ణించారు.
Washing Machine: టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. ఏది బెస్ట్? ఎందుకు?
ఈ ట్వీట్ సదరు మహిళ గౌరవాన్ని దెబ్బతీసిందంటూ.. 2021 జనవరి 4న మహిందర్ కౌర్ బతిండా కోర్టులో డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కంగనా తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించినప్పటికీ, ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై 13 నెలల పాటు విచారణ జరిగిన అనంతరం బతిండా కోర్టు కంగనాకు సమన్లు జారీ చేసింది. దీంతో ఈ కేసును రద్దు చేయించుకోవాలనే ఉద్దేశంతో కంగనా పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, జస్టిస్ త్రిభువన్ సింగ్ దహియా నేతృత్వంలోని కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. కంగనా రనౌత్ ఒక సెలబ్రిటీ.. ఆమె చేసిన ట్వీట్ లేదా రీట్వీట్ వలన బాధిత మహిళ ప్రతిష్టకు హాని జరిగిందని, అది పూర్తిగా మనభిమానానికి దారితీసేలా ఉందని కోర్టు పేర్కొంది. మ్యాజిస్ట్రేట్ అన్ని ఆధారాలను పరిశీలించిన తరువాతే కంగనాపై ప్రాథమికంగా IPC సెక్షన్ 499 ప్రకారం కేసు కొనసాగించేలా నిర్ణయించారని పేర్కొంది. దీంతో, ఇకపై కంగనాకు పంజాబ్‌లోని స్థానిక కోర్టులో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.
ENG vs IND: అందరికీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్‌లోకి వెళ్లాడు
అయితే , కంగనా తన తరఫు వాదనలో తాను స్వయంగా ఆ ట్వీట్ రాయలేదని.. ఒక న్యాయవాది పోస్టును కేవలం రీట్వీట్ చేశానని చెబుతున్నారు. అయినప్పటికీ, కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. దీనితో మరోసారి ఈ కేసు సంబంధించి ఆమెపై విచారణ కొనసాగనుంది.
