Sesham Mike-il Fathima : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళం బ్లాక్ బస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చాక భాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ప్రతి సినిమాను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళ సినిమాలలో ఎలాంటి జోనర్ సినిమాలకైనా తెలుగు ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.2018, పద్మినీ, జర్నీ ఆఫ్ 18 ప్లస్, ఆర్ డీ ఎక్స్, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్వ్కాడ్ తదితర మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. అదే కల్యాణి ప్రియ దర్శన్ నటించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా. నవంబర్ 17న మలయాళంలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. డిసెంబర్ 15 నుంచే కల్యాణి ప్రియ దర్శన్ ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.మనూ సి కుమార్ తెరకెక్కించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు ఫెమినా జార్జ్, షహీన్ సిద్ధికీ, పార్వతి, అనీశ్ మీనన్ మరియు సాబుమన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా నూర్జహాన్(కల్యాణి ప్రియదర్శన్) ఫుట్ బాల్ కామెంటేటర్ అవ్వాలని అనుకుంటుంది. అయితే ఫ్యామిలీలో ఎవరి మద్దతూ లభించదు. దీంతో స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు కామెంటరీ చేస్తుంటుంది. అయితే ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్‌లకు కామెంటరీ కావాలన్నదే ఫాతిమా లక్ష్యం. మరి ఆమె లక్ష్యం నెరవేరిందా.. అందుకు ఫాతిమా స్నేహితులు ఆమెకు ఎలాంటి సాయం చేశారన్నది ఈ సినిమా కథ.. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మలయాళి మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
NINGAL IDHU KAANUKA!! Mike-il ippo Fathima vannu etheetundu😍
Shesham Mike-il Fathima is coming to Netflix on 15 December in Malayalam, Telugu, Tamil, Kannada and Hindi!#SheshamMikeilFathimaOnNetflix pic.twitter.com/rzBUwFR1FJ— Netflix India South (@Netflix_INSouth) December 10, 2023
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!