Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు సెరెంటికా గ్లోబల్ సిద్ధం

Nara Lokesh

Nara Lokesh

Andhra Pradesh: వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలోని సంస్థ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి తమ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 2030 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ఎపి ప్రభుత్వ లక్ష్యసాధన కోసం సెరెంటికా గ్లోబల్ వంటి కార్పొరేట్లు, ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నాం. రాష్ట్రంలో పెద్దఎత్తున రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలని తాము భావిస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Read Also: Minister Satya Kumara Yadav: స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీల‌కం.. గుర్లలో డయేరియా ప్రబలడంపై మంత్రి సమీక్ష

Exit mobile version