NTV Telugu Site icon

karthi – Sardar Part 2: సీక్వెల్స్‎ మీద సీక్వెల్స్ .. జోరు మీదున్న హీరో కార్తీ

Sardar

Sardar

karthi – Sardar Part 2: దీపావళి సందర్భంగా కార్తీ నటించిన ‘సర్ధార్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ల పరంగా సినిమా సత్తా చాటుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి కార్తి అండ్ టీమ్ రెడీ అవుతోంది. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‎లో చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సర్ధార్’ క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు.

Read Also: Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్

ఇప్పుడు కార్తీ చేతిలో మూడు సీక్వెల్స్!
‘సర్దార్ 2’ కాకుండా కార్తీ చేతిలో మరో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ చిత్రానికి తమిళంలో, తెలుగులో మంచి వసూళ్లు వచ్చాయి. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్ లో ‘ఖైదీ’లో ఢిల్లీ పాత్రను చూపించారు. నిజానికి ‘ఖైదీ’ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ లోకేష్ ప్రస్తుతం విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తైన తర్వాత ‘ఖైదీ 2’ ఉండొచ్చు. మరో సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఆయనతో పాటు విక్రమ్, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రభు, లాల్, శరత్ కుమార్ తదితరులు నటించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 సెప్టెంబర్ 30న విడుదల అయ్యింది. ఆల్రెడీ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

Show comments