NTV Telugu Site icon

Stock market: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న జైత్రయాత్ర.. రికార్డ్‌లు బద్ధలుకొట్టిన సూచీలు

Stock

Stock

స్టాక్ మార్కెట్‌ రికార్డుల మోత మోగిస్తున్నాయి. వరుస లాభాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రతి రోజూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక.. మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ శైలి సాగిపోతుంది. మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డ్ సృష్టించగా.. బుధవారం అంతకు మించి తాజా రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 78, 674 దగ్గర ముగియగా.. నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 23, 868 దగ్గర ముగిసింది. రెండూ కూడా సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇక డాలర్‌పై రూపాయి మారకం విలువ 83.57 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: AP High Court: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టు షాక్..

నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడగా.. అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, టాటా స్టీల్ మరియు హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి.సెక్టార్లలో బ్యాంక్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, మీడియా మరియు ఎఫ్‌ఎంసిజి 0.3-2 శాతం పెరగగా, ఆటో, మెటల్ మరియు రియల్టీ 0.7-1.5 శాతం క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగిసింది.

ఇది కూడా చదవండి: Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబ్ బెదిరింపులు..