Site icon NTV Telugu

BiggBoss 8 : ఓటీటీలో బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ కు హ్యూ్జ్ రెస్పాన్స్

Biggboss8

Biggboss8

BiggBoss 8 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికి తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 8 కూడా అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లతో పూర్తయింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో విజేతగా కన్నడ మలియక్కల్ నిఖిల్ నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు. బిగ్‌బాస్‌ సీజన్‌ 8 తెలుగులో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్‌ షోలో పాల్గొనగా.. ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్‌, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు ఫైనలిస్ట్‌గా నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్‌లో నిఖిల్ విజేతగా నిలవగా.. గౌతమ్‌ రన్నరప్‌గా నిలిచాడు. విజేత నిఖిల్‌ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడు. నటుడు నిఖిల్ గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సీరియల్‌లో పార్థుగా ఆడియన్స్‌ను అలరించాడు. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూరు. నిఖిల్ తండ్రి జర్నలిస్ట్ కావడం విశేషం. సీరియల్‌ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన నిఖిల్.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా మరో మెట్టు ఎక్కాడు.

Read Also:Job Mela In Vijayawada: విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా

రన్నరప్‌గా నిలిచిన గౌతమ్.. వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైల్డ్‌ కార్డు ద్వారా వచ్చినా నిఖిల్‌కు మాత్రం గట్టి పోటీనిచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడనుకున్న గౌతమ్..తిరిగి టైటిల్‌ రేస్‌లో నిలిచి నిఖిల్‌కు చెమటలు పట్టించడంతో పాటు చివరి వరకూ గట్టి పోటీనిచ్చాడు. లేటెస్ట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి ఫైనల్ ఎపిసోడ్ తాలూకా రికార్డులు బయటకి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తాను బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో ఏకంగా 23 మిలియన్ మందికిపైగా వీక్షించారట. అలాగే ఆ ఒక్క ఎపిసోడ్ కి 2 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ కూడా నమోదు అయినట్లుగా నాగార్జున తెలిపారు. దీనితో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ భారీ హిట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే.

Read Also:Dhirubhai Ambani Birthday : అంబానీ తన బిడ్డల కోసం ఎంత సంపదను మిగిల్చాడో తెలుసా ?

Exit mobile version