కేరళలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను అంతమొందించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కత్తితో దాడి చేసి ఆరుమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం వెంజరమూడిలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫాన్ అనే యువకుడు ఆ కారణాలతోనే ప్రియురాలి కుటుంబాన్ని హతమార్చాడని తెలిసి అంతా షాక్ గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read:V.Hanumantha Rao: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..
ఆఫాన్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి రిలేషన్ కొంత కాలం బాగానే ఉంది. ఆ తర్వాత ఆఫాన్ డ్రగ్స్ కు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో డబ్బులు కావాలని ప్రియురాలిని వేధించేవాడు. ప్రియురాలి తల్లి, అమ్మమ్మకు చెందిన బంగారు నగలను ఇవ్వాలని విసిగించేవాడు. కాగా ప్రియురాలు ఆఫాన్ కు బంగారు నగలు ఇవ్వకపోవడంతో కక్షపెంచుకున్నాడు. బంగారు హారాన్ని, నగలను అమ్ముకోవడానికి ఇవ్వకపోవడంతోనే హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ మత్తులో హత్యలకు ప్లాన్ చేశాడు.
Also Read:Mazaka: ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ని చాలా ఎంజాయ్ చేస్తారు: త్రినాధరావు నక్కిన
ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ప్రియురాలి కుటుంబ సభ్యులను కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఆరుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. రెండు ఇళ్ళలోని కుటుంబ సభ్యులను మొదట చంపిన తరువాత, ప్రియురాలిని చంపడానికి 24 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేసి అమె ఇంటికెళ్ళి ప్రాణాలు తీశాడు. అనంతరం విషం తాగి నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి ఆఫాన్ లొంగిపోయాడు. పోలీసులు వెంటనే ఆ నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.