NTV Telugu Site icon

Hathras Case: బాబా ఎక్కడికి పారిపోలేదు.. భోలే బాబా తరఫు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..

Bhole Baba

Bhole Baba

ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత సూరజ్‌పాల్‌ అలియాస్‌ భోలే బాబాపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. బాబా సూరజ్‌పాల్ పరారీలో లేరని బాబా సూరజ్‌పాల్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. హత్రాస్‌లో బాబా సూరజ్‌పాల్ సత్సంగ నిర్వాహకుడు దేవ్ మధుకర్ ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.

READ MORE: Jammu kashmir Encounter: సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. సైనికుడి మృతి

దేవ్ మధుకర్‌కు గురించి ఏపీ సింగ్ మాట్లాడుతూ. ‘నేను మొదట దర్యాప్తును అనుమతిస్తాను. నేను అస్సలు బెయిల్ కోసం అర్జించను. మొదటి వాదన వినండి.. ఆ తర్వాతే బెయిల్ డిమాండ్ చేస్తాను. మధుకర్ పరిస్థితి మెరుగుపడిన వెంటనే లొంగిపోతాడని పోలీసులకు హామీ ఇచ్చాను. అతను హార్ట్ పేషెంట్. బాబా సదస్సుకు ఆయన నిర్వహకుడిగా పనిచేశారు. ఆ సత్సంగానికి తన కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు. అక్కడ జరిగిన సంఘటనతో అతడి ఆరోగ్యం విషమించింది.” అని పేర్కొన్నారు.

READ MORE: Union Budget 2024: జూలై 23న మోడీ సర్కార్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..

హత్రాస్‌లోని సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటకు కొందరు సంఘ వ్యతిరేక శక్తులే కారణమని భోలే బాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సంఘ వ్యతిరేకులు ఉన్నారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. నారాయణ్ సర్కార్ 35 నిమిషాల క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. సంఘ వ్యతిరేకులు ప్రవేశించి విధ్వంసం సృష్టించారని.. ఇది ప్రపంచం మొత్తం చూసింది.” అని సింగ్ పేర్కొన్నారు. బాబా సూరజ్‌పాల్ భారతదేశంలోనే ఉన్నారని న్యాయవ్యాధి సింగ్ తెలిపారు. అతను భారతదేశంలో ఉన్నారని.. ఎక్కడికీ పరిగెత్తలేదని స్పష్టం చేశారు. ఈ తొక్కిసలాటలో బాబా పాత్ర లేదని ఏపీ సింగ్ పేర్కొన్నారు. బాబా అరగంట క్రితమే వెళ్లిపోయారని తెలిపారు. బాబా వద్ద మొబైల్ ఫోన్ కూడా లేదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా సైట్‌లో కూడా లేరని.. వారు టీవీ, వార్తలు చదవక పోతే విషయమే తెలిసేది కాదన్నారు.