Site icon NTV Telugu

SA vs NED: వరల్డ్‌ కప్‌లో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన డచ్‌ వీరులు

Ned

Ned

వరల్డ్ కప్ లో మరో సంచలన విజయం నమోదైంది. ఇటీవలే ఇంగ్లాండ్ పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి ఊహించని విధంగా గెలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా నెదర్లాండ్ కూడా మరో భారీ షాక్ ను ఇచ్చింది. చిన్న టీమే కదా అని తక్కువ అంచనా వేస్తే.. వరల్డ్ రికార్డ్ లు క్రియేట్ చేసిన టీంను మట్టికరిపించింది.

ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించారు. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీం సౌతాఫ్రికాపై గెలుపొందారు. మొదట వర్షం కారణంగా ఇరు జట్లకు 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 245/8 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులు చేసి ఆలౌటైంది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్ బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ ఎడ్ వర్డ్స్ (78) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అటు బౌలింగ్ లో కూడా అందరూ సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించారు. సఫారీ బ్యాట్స్ మెన్లలో కేశవ్ మహరాజ్ చివరి ఓవర్ వరకు పోరాడినా కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు.

Exit mobile version