Site icon NTV Telugu

AB Venkateshwara Rao: పోస్టింగ్ ఇవ్వండి.. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన సీనియర్ ఐపీఎస్ అధికారి

Ab Venkateshwara Rao

Ab Venkateshwara Rao

AB Venkateshwara Rao: సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కలిశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఇచ్చారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై త్వరితగతిన ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. సీఈవో కార్యాలయంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఏబీవీ ఇచ్చారు.

Read Also: Kurnool: అవసరమైతే జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు: కలెక్టర్ సృజన

క్యాట్‌ (కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. క్యాట్ ఉత్తర్వులో జోక్యం చేసుకోబోమని కోర్టు వెల్లడించింది. ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు‌ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ సర్కారు అప్పీల్‌ను కొట్టివేసింది.

Exit mobile version