IAS Srinivasa Raju took VRS: వీఆర్ఎస్‌ తీసుకున్న సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్‌ శ్రీనివాసరాజు.. కారణం అదేనా..?

  • వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజు..
  • కొద్దిరోజుల క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు.. ఆమోదించిన సీఎస్ప్ర నీరబ్‌..
  • టీటీడీ ఈవో పోస్టింగ్ ఆశించారట శ్రీనివాస రాజు..!
  • టీటీడీ ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావును నియమించిన సర్కార్..
Srinivasa Raju

Srinivasa Raju

IAS Srinivasa Raju took VRS: వీఆర్ఎస్ తీసుకున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస రాజు.. కొద్దిరోజుల క్రితం వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు శ్రీనివాస రాజు.. అయితే, శ్రీనివాస్ రాజు దరఖాస్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ ఆమోదం తెలిపారు.. కాగా, టీటీడీ ఈవో పోస్టింగ్ ఆశించారట శ్రీనివాస రాజు.. కానీ, ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావును నియమించింది.. దీంతో.. ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ నుంచి రిలీవై ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన శ్రీనివాసరాజు.. నాలుగేళ్ల పాటు తెలంగాణలో విధులు నిర్వహించారు.. తెలంగాణలో రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక, డిప్యూటేషన్‌ ముగియడంతో తిరిగి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా శ్రీనివాసరాజు సుదీర్ఘకాలం పనిచేశారు. వరుసగా తొమ్మిదేళ్ల పాటు టీటీడీ జేఈవోగా వ్యవహరించారు.

Read Also: T20 World Cup 2024: నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఛీటింగ్..