కొంత మందికి ఎంత డబ్బున్నా.. చదువున్నా.. వివేకం ఉండదు. చేసే పనులను బట్టి తమ విలువను పోగొట్టుకుంటారు. ఒకప్పుడు విద్యలేని వాడు వింత పశువు అన్నారు. కానీ ఇప్పుడు విద్యావంతులే గతి తప్పుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఆమె ఒక విద్యావంతురాలు. లండన్‌లో చదువు. పైగా ముంబైలో ఓ సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె. డబ్బు.. హోదా.. ఏం కావాలంటే దాన్ని అనుభవించొచ్చు. కావాలంటే కోటీశ్వరుడిని తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేసేంత గొప్ప కుటుంబం. అయితేనే… ఎన్నుంటే ఏం ఉపయోగం. కానీ ఆమె మాత్రం ఇంట్లో పని చేసే కారు డ్రైవర్‌తో పారిపోయింది.
ముంబైలో సీనియర్ బ్యూరోక్రాట్‌కు 19 ఏళ్ల కుమార్తె ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిని. డిసెంబర్‌లో ఇంటికి వచ్చింది. జనవరి 13న తిరిగి లండన్ వెళ్లేందుకు కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తోంది. అటు నుంచి అటే వివాహితుడైన మౌర్య (35) అనే డ్రైవర్‌తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచీ ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాప్ అయిపోయాయి. అయితే తమ కుమార్తె కనిపించడం లేదంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమకు పెళ్లి అయిందని తెలియజేశారు. విచారణ అనంతరం కుమార్తెను బ్యూరోక్రాట్‌కు అప్పగించారు. ప్రస్తుతం డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తు్న్నారు.
ఇద్దరు పారిపోయాక.. మౌర్య సోదరుడు అజిత్‌కుమార్ (21)తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూపీలోని అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు విలువైన వస్తువులు గుర్తించారు. మౌర్య తనను ముంబైకి పిలిపించి విలువైన వస్తువులను ఇచ్చాడని పోలీసులకు తెలిపాడు. జనవరి 23న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే మౌర్య భార్య ఉత్తరప్రదేశ్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు.
