NTV Telugu Site icon

ChandraMohan: 1000కి పైగా సినిమాలు చేశా.. 100కోట్లు పోగొట్టుకున్నా

Chandra Mohan

Chandra Mohan

Chandra Mohan : క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమై.. తర్వాత హీరోగా సినిమాలు తీసి మెప్పించారు సీనియర్ యాక్టర్ చంద్రమోహన్. హీరోగా, ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయే నటుడు చంద్రమోహన్. ఆయన ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఎమోషనల్ పాత్రలో నాచురల్ గా నటించి అభిమానుల చేత కంటతడి పెట్టించేవారు. ఇలా ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. గత నాలుగైదేళ్లుగా ఆయన వెండితెరపై కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. చంద్రమోహన్‌ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ.. చంద్రమోహన్‌ చేయి చాలమంచిదని.. ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందంటారు. జనవరి ఒకటో తారీఖుకు ఎంతోమంది వస్తుంటారు. అలా ఆయన చేత్తో నాకు డబ్బివ్వడం వల్ల నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది అని ఆమె చెప్పడంతో చంద్రమోహన్‌ ఎమోషనలై కళ్లు తుడుచుకున్నాడు.

Read Also: Hansika Marriage: నేడే ‘దేశముదురు’ భామ పెళ్లి.. అతిథులు ఎవరో తెలుసా..?

చంద్రమోహన్‌ తను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తుల గురించి వివరించారు. సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నప్పుడు తననూ కొనమని చెప్పడంతో 35 ఎకరాల దాకా కొన్నానని చెప్పారు. కానీ దాన్ని చూసుకోలేక అమ్మేశానన్నారు. శోభన్‌ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మారట. ప్రస్తుతం ఆ భూమి విలువ ఇప్పుడు సుమారు రూ.30కోట్లు ఉంటుందన్నారు. శంషాబాద్‌ దగ్గర మెయిన్‌ రోడ్‌కు 6 ఎకరాలు కొన్నారట. అదీ అమ్మేశానన్నారు. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్లు దాకా పోగొట్టుకున్నానని… సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని చంద్రమోహన్ వివరించారు. జయసుధది కూడా అదే పరిస్థితి అంటూ అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.

Show comments