ChandraMohan: 1000కి పైగా సినిమాలు చేశా.. 100కోట్లు పోగొట్టుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandra Mohan : క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమై.. తర్వాత హీరోగా సినిమాలు తీసి మెప్పించారు సీనియర్ యాక్టర్ చంద్రమోహన్. హీరోగా, ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయే నటుడు చంద్రమోహన్. ఆయన ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఎమోషనల్ పాత్రలో నాచురల్ గా నటించి అభిమానుల చేత కంటతడి పెట్టించేవారు. ఇలా ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. గత నాలుగైదేళ్లుగా ఆయన వెండితెరపై కనిపించడమే మానేశాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. చంద్రమోహన్ భార్య జలంధర ప్రముఖ రచయిత్రి. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జలంధర మాట్లాడుతూ.. చంద్రమోహన్ చేయి చాలమంచిదని.. ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందంటారు. జనవరి ఒకటో తారీఖుకు ఎంతోమంది వస్తుంటారు. అలా ఆయన చేత్తో నాకు డబ్బివ్వడం వల్ల నాకూ మంచి రచయిత్రిగా పేరొచ్చింది అని ఆమె చెప్పడంతో చంద్రమోహన్ ఎమోషనలై కళ్లు తుడుచుకున్నాడు.
Read Also: Hansika Marriage: నేడే ‘దేశముదురు’ భామ పెళ్లి.. అతిథులు ఎవరో తెలుసా..?
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
చంద్రమోహన్ తను సంపాదించి పోగొట్టుకున్న ఆస్తుల గురించి వివరించారు. సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు కోంపల్లి దగ్గర ద్రాక్షతోట కొన్నప్పుడు తననూ కొనమని చెప్పడంతో 35 ఎకరాల దాకా కొన్నానని చెప్పారు. కానీ దాన్ని చూసుకోలేక అమ్మేశానన్నారు. శోభన్ బాబు చెప్తున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మారట. ప్రస్తుతం ఆ భూమి విలువ ఇప్పుడు సుమారు రూ.30కోట్లు ఉంటుందన్నారు. శంషాబాద్ దగ్గర మెయిన్ రోడ్‌కు 6 ఎకరాలు కొన్నారట. అదీ అమ్మేశానన్నారు. ఇప్పుడక్కడ మంచి రిసార్టులు పెట్టారు. అలా దాదాపు రూ.100 కోట్లు దాకా పోగొట్టుకున్నానని… సంపాదించినవాటికన్నా పోగొట్టుకున్నవే ఎక్కువని చంద్రమోహన్ వివరించారు. జయసుధది కూడా అదే పరిస్థితి అంటూ అని చెప్పుకొచ్చారు చంద్రమోహన్.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!