Tamilnadu : మా రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టండి.. కావాల్సినంత సబ్సిడీ ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : ఇటీవల దేశంలో సెమీకండక్టర్ అంటే చిప్ పరిశ్రమ కోసం పెద్ద సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా చిప్స్ విషయంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వైపు నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. తాజాగా తమ రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలపై అదనపు సబ్సిడీని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విధంగా తమిళనాడులోని చిప్‌ల తయారీ కంపెనీలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలను పొందబోతున్నాయి.
జనవరి 7న పెట్టుబడిదారుల కార్యక్రమం TN GIM 2014 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు సెమీకండక్టర్ అండ్ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2024ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపిక చేయబడిన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు, రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు 50 శాతం అదనపు ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల చిప్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి వివిధ దేశీయ, విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. నేటి కాలంలో, అనేక పరిశ్రమలకు సెమీకండక్టర్లు చాలా ముఖ్యమైనవి. అది కార్ల పరిశ్రమ అయినా లేదా గృహాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ అయినా, చిప్స్ ప్రతిచోటా పెద్ద ఎత్తున అవసరమవుతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ప్లాంట్లు నెలకొల్పే ప్రాజెక్టులకు 50 శాతం అదనపు సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎంపికైన వారి నుంచి తమిళనాడుకు వచ్చే ప్రాజెక్టులకు ఉద్యోగుల శిక్షణ, స్టాంప్ డ్యూటీ, భూమి, విద్యుత్తుకు సంబంధించిన రాయితీలు కూడా ఇవ్వబడతాయి. ఏదైనా చిప్ లేదా ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లేదా డిజైన్ కంపెనీ రాష్ట్రానికి వస్తే, తమిళనాడుకు చెందిన వారిని నియమించుకుంటే వారికి మూడేళ్ల పాటు జీతంలో 30శాతం రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. ఈ రీయింబర్స్‌మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.20 వేల పరిమితిని నిర్ణయించింది.
Read Also:Kotamreddy Sridhar Reddy: పది రూపాయలు ఇచ్చి వంద లాక్కుంటున్నారు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..!
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?