Used Cars: భాగ్యనగరంలో పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Used Cars: ప్రస్తుతం జనాలందరూ తాము సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ముఖ్యంగా సొంత ఇల్లు, కారు ఉండాలని ఆశ పడుతున్నారు. బ్యాంకులు కూడా వీటికి సంబంధించి లోన్ లు ఇస్తూ ఉండటంతో వీటిని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే ఫ్యామిలీతో బయటకు వెళ్లడానికి బైక్ ల కంటే కార్లు చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అందుకే కుటుంబం కోసమైనా కారు కొనాలనుకుంటున్నారు. కొత్తకారు కొనే స్తోమత లేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగులు చేస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది భాగ్యనగరంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 156 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా బ్యాంకులు లోన్ ఇవ్వడం వీటి అమ్మకాలకు ఊతమిచ్చినట్లు అయ్యింది. మైలేజీ, ప్రీమియం ఫీచర్స్, ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, ఆటోప్లే మ్యూజిక్ సిస్టమ్స్, సన్‌రూఫ్స్, అడ్వాన్స్ టెక్నాలజీ సెకండ్ హ్యాండ్ కారు కొనే వారు ఇవన్నీ మొదటగా చూస్తున్నారు. ఇవి బాగుంటేనే ఆ కారును తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ఇక ధర విషయానికి వస్తే ఆరు లక్షల లోపు ఉండే కార్లను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. సెకండ్ హ్యాండ్ లో కూడా కొన్ని కార్ల మోడళ్లను వినియోగదారులు ఎక్కువగా కొంటున్నారు. వాటిలో మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, ఆల్టో, బాలెనో కార్లు ఉన్నాయి. ఇక ఇవేకాకుండా ఐ20 సిటీ, రెనో క్విడ్, ఐ20 సిటీ, వోక్స్ వాగన్ పోలోలు ఉన్నాయి. వీటిని ఆయా సంస్థలు జీరో పేమెంట్ తో అందిస్తూ ఉండటంతో వీటి డిమాండ్ బాగా పెరిగింది. జీరో డౌన్ పేమెంట్‌తో వాహనాలు తీసుకునే వారి సంఖ్య హైదరాబాద్ లో 142 శాతం పెరిగింది.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?