NTV Telugu Site icon

Driverless Bus: డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్

Autonom Shuttle 1 740x520

Autonom Shuttle 1 740x520

Driverless Bus: ఇప్పటి వరకు డ్రైవర్ లేని కార్లు బస్సులను వార్తల్లోనే చూసి.. చదివి ఉంటారు… అయితే డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం త్వరలో మీ కోరిక నెరవేరనుంది. మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్. ప్రస్తుతం వాటిలో జర్నీ చేయాలంటే మాత్రం సౌత్ కొరియా వెళ్లాలి. అక్కడకి వెళ్తే మీరు డ్రైవర్‌ లేని బస్సులో ప్రయాణించొచ్చు. చిన్న వ్యాను పరిమాణంలో ఉండే ఈ బస్సు డ్రైవర్‌ లేకుండానే రోడ్లపై రయ్యుమంటూ పరుగులు పెడుతోంది. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు. పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తుంది. ఈ బస్సు కొనలు రౌండ్‌గా ఉండి, పెద్ద పెద్ద విండోస్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బస్సులో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు ఉంటాయి. వాటితో రోడ్డుమీద వెళ్లే పాదచారులను, ఇతర వాహనాలను గుర్తిస్తుంది. సౌత్‌ కొరియాలో ఆవిష్కృతమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది.

Read Also: Flipkart: ఆన్ లైన్‎లో ఫోన్ బుక్ చేస్తే.. వచ్చింది చూసి కంగుతిన్న కస్టమర్

ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని రుజువు చేస్తోంది దక్షిణ కొరియాకి చెందిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు. నిర్ధారిత రూట్‌లో ఈ బస్సుని రెండురోజుల క్రితమే ఆవిష్కరించారు. బొమ్మ బస్సులా కనిపించే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు సాధారణ బస్సులకన్నా ప్రత్యేకంగా ఉంటుంది. డ్రైవర్‌తో పనిలేకుండా తన గమ్యస్థానానికి సేఫ్‌గా చేరుకుంటుంది. ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ హుందయ్ కంపెనీ తయారుచేసిన ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సు భవిష్యత్తు రవాణా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీని అత్యంత తక్కువ ధరకు అట్టడుగు వర్గాలకు చేరువ చేయడమేనని బస్సు లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో ట్రక్‌లు, ఇతర వాహనాలను కూడా డ్రైవర్‌ రహితంగా తయారుచేయాలని భావిస్తోంది హుందయ్ కంపెనీ.