Sekhar Master: టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నవంబర్ 11 రాత్రి శంషాబాద్ పరిధిలోని కొల్లూరు జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణను ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే, శేఖర్ మాస్టర్ తన ఇన్నోవా కారులో మరో డ్యాన్స్ మాస్టర్, డ్రైవర్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. కొల్లూరు వైపు నుంచి వస్తున్న వీరి ఇన్నోవా కారు, ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఇదే క్రమంలో వెనుక నుంచి పండ్ల లోడ్‌తో వేగంగా వస్తున్న ఒక లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ వరుస ప్రమాదాల ధాటికి శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ముందు, వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..

Sekhar Master
