Sejal Suside Attempt: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గతంలో ఆరోపణలు చేసిన షేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆదినారాయణ రావు షేజల్ ను పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలివెళ్లాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన దగ్గర సరైన ఆధారాలు లేవు అన్న మాటలకి షేజల్ మనస్థాపం చెంది.. నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. మరోవైపు శేజల్ బ్యాగులో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?
సూసైడ్ లెటర్ లో సేజల్ రాసిన వివరాలు ఇలా ఉన్నాయి. నాకు కేటిఆర్ అన్యాయం చేశారని.. ఢిల్లీలో కేసిఆర్ ఇంటి ముందు నిరసన చెబుతుంటే కేటీఆర్ కలిశారని తెలిపింది. దుర్గం చిన్నయపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని.. కేటీఆర్ తో పాటు పార్టీ పెద్దలు కూడా ఉన్నారని పేర్కొంది. దుర్గం చిన్నయ పై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపిన శేజల్.. తనను హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారని లెటర్ లో రాసింది. వారం రోజులకి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారని.. కానీ మొన్న కేటీఆర్ చేసిన వాఖ్యలు తనను నమ్మకద్రోహం చేసినట్టు అనిపించిందని తెలిపింది. తన మీద లైంగిక దాడి జరగలేదు అని చెప్పాడని.. తనను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడని శేజల్ లెటర్ లో రాసింది. తనను ఎప్పుడు చంపుతారో తెలియదని.. పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు అంటూ శేజల్ లేటర్ లో పేర్కొంది.
Read Also: TS ICET RESULTS: టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలు తెలుసుకోండిలా..!
కాగా.. చిన్నయ్య తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేను తక్షణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని శేజల్ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం తెలంగాణ భవన్ వద్ద విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన అక్కడి వారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఇంతలో మరోసారి ఇలా ఆత్మహత్యాయత్యానికి పాల్పడింది.
