NTV Telugu Site icon

Seetharama Project : సీత రామ మోటార్ల ట్రైల్ రన్ సక్సెస్

Sitarama Project

Sitarama Project

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామల చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రైయిల్ రన్ గటగా రాత్రి సక్సెస్ అయింది. గత వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వచ్చింది .సీతారామ ప్రాజెక్టు సక్సెస్ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 17 వేల కోట్ల రూపాయలు అంచనా తో పది లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు కోసం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు .ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆటుపోటులను ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో ఏడు వేల కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం వ్యయం చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా ఉంది .ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా మోటార్లు సిద్ధం అయినప్పటికీ ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూర్ నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నారు.

ఈ కాలువ నిర్మాణం ఆగస్టు నెలకి పూర్తి అవుతుంది. ఇది పూర్తి అయితే గోదావరి నుంచి సీతారామ ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా తీసుకొని వైరా వరకు సాగునీరు వస్తుంది. వైరా రిజర్వాయర్ నుంచి నాగర్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి అయిన దగ్గర నుంచి నిరంతరం సీతారామ ప్రాజెక్టు కోసం నిర్మాణం కోసం పూర్తి చేసేందుకు అధికారులు వెంట పడటం జరిగింది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు సంబంధించి మోటార్ల టైలరింగ్ గత రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13 వేల కోట్ల కి టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం 17 వేల కోట్లకి పెరిగింది ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు భద్రాద్రి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకి మహబూబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది