Site icon NTV Telugu

SeethaRam: వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం.. లక్షకి పైగా భక్తుల రాక..?!

2

2

శ్రీరామనవమి పండుగ అనుసరించి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతా రాముల కళ్యాణం అంగరగవైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని. లకు అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం జరగనుంది. స్వామివారి కల్యాణానికి చూడడానికి ఇప్పటికే లక్షకి పైగా భక్తులు వచింతలు తెలుస్తోంది. ఆలయ చైర్మన్ గెస్ట్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేసారు అధికారులు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలకు అభిషేకము నిర్వహించారు ఆలయ అర్చకులు.

Also read: KCR: కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిన ఈసీ.. రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో..!

ఇక నేడు ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కొల్లు కార్యాక్రమం జరుగును. ఆపై సాయంత్రం స్వామివారి రథోత్సవం జరుగును. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎస్పీ నాగేంద్ర చారి ఆద్వర్యంలో పోలీస్ ల భారీ బందోబస్తు రేపాటు చేయడం జరింగింది.

Also read: UAE Rains: యూఏఈలో భారీ వర్షాలు.. ఒమన్‌లో 18 మంది మృతి!

ఇక కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా జోగినిలు, శివ పార్వతులు, హిజ్రాలు వారు కనపడనున్నారు. ఇక నేడు ఆలయంలో కోడె మొక్కు మినహా అన్ని పూజలు రద్దు చేసినట్లు అధికారుల వెల్లడించారు.

Exit mobile version