NTV Telugu Site icon

Seethakka: స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..

Minister Seethakka

Minister Seethakka

స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాల‌ని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. మంత్రి ఆదేశాల‌తో ఇంధ‌న కార్యద‌ర్శికి పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యద‌ర్శి లోకేష్ కుమార్ ప్రతిపాద‌న‌లు పంపారు. మ‌హిళా సంఘాల‌కు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వెయ్యి మేగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లను కేటాయించాల‌ని కోరినట్లు తెలిపారు. మ‌హిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే అనువైన భూములను గుర్తించి మ‌హిళా సంఘాలకు లేదా స‌మాఖ్యల‌కు లీజుకు భూముల‌ను ఇప్పిస్తామ‌ని వెల్లడించారు.

READ MORE: Konda Visveshwar Reddy: ఖురాన్‌లో వక్ఫ్‌ ప్రస్తావన లేదు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

మ‌హిళా సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించ‌డం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. “ఒక్క మేగా వాట్ ప్లాంట్ కి రూ. మూడు కోట్ల వ్యయం సమకూరుతుంది. 10 శాతం మ‌హిళా సంఘాలు కాంట్రిబ్యూట్ చేస్తే 90 శాతం బ్యాంకు ద్వారా లోన్లు మంజూరవుతాయి. ఇంధ‌న శాఖ అనుమ‌తులిస్తే వారంలోపు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఇన్స్టాలేష‌న్ పూర్తి చేస్తాం. ఒక్క మేగా వాట్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 ల‌క్షల ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు ఇందిరా మ‌హిళా శ‌క్తి స్కీంను ప్రారంభించింది. ప్రజా ప్రభుత్వం. మంత్రి సీత‌క్క‌ చొర‌వ‌తో మ‌హిళా సంఘాల కోసం 17 వ్యాపారాలు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు యూనిఫాం కుట్టుప‌ని, మ‌హిళా శ‌క్తి క్యాంటిన్లతో పాటు ప‌లు ర‌కాల వ్యాపారాల్లోకి మ‌హిళా సంఘాలు పనిచేస్తు్న్నాయి. బ్యాంక్ లింకేజ్ ద్వారా వ‌డ్డీలేని రుణాలు ఇస్తూ మ‌హిళా సంఘాలను ప్రొత్సహిస్తోంది ప్రభుత్వం. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తున్నాం.” అని సీతక్క తెలిపారు.