NTV Telugu Site icon

Minister Seethakka :కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు నీళ్ల లో పోసింది సరిపోలేదా…

Seethakka

Seethakka

మాట మాట్లాడితే హరీష్ రావు దిగిపో అంటున్నారు.. రాజీనామాలు అంటున్నారని మంత్రి సీతక్క హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆమె కొమురం భీం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు పదవి కాంక్ష ఏంటో తెలిసిందని, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. చాలామందికి నువ్వు డబ్బులు ఇచ్చావని నీకు పదవి ఇవ్వకుండా ఆపారని, అప్పుడు ఎక్ నాథ్ షిండే లాగా నువ్వు వ్యవహరించవని నీకు పదవి ఇవ్వకుండా ఆపారంట.. ఇవి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయని ఆమె అన్నారు. అధికారం పోయిందని అసహనం విమర్శలు చేస్తున్నారని, కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు నీళ్ల లో పోసింది సరిపోలేదాన్నారు మంత్రి సీతక్క.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిందని, ఆదివాసి గిరిజన బిడ్డను తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేకాకుండా.. ‘నువ్వు దిగిపో ..నేను కట్టేస్తా కాలేశ్వరం అంటున్నాడు లక్ష కోట్లు తిన్నది సరిపోదా… లక్ష కోట్లు తిన్నది సరిపోదని మళ్లీ నువ్వే కడతావా. కాంగ్రెస్ ను అనడానికి బీఆర్ఎస్ బిజెపికి నైతిక అర్హత లేదు. రుణ మాఫీ అంటే కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. ప్రజల క్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. కాంగ్రెస్ అంటే గ్యారెంటీ గ్యారెంటీ అంటే కాంగ్రెస్.’ అని మంత్రి సీతక్క అన్నారు.