NTV Telugu Site icon

Kerala: బస్సులో నుంచి కిందపడబోతున్న ప్రయాణికుడిని కండక్టర్ ఎలా కాపాడాడో చూడండి..

New Project (67)

New Project (67)

కండక్టర్ చాకచక్యం ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన కేరళలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నాడు. తన బ్యాలెన్స్ అవుట్ అయి కదులుతున్న బస్సులో నుంచి కిందపడబోయాడు. కండక్టర్ ఓ చేతిలో టికెట్ మిషన్ పట్టుకొని మరో చేతితో అతడి చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కేరళ బస్సు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి చాలా మంది బస్ కండక్టర్ శక్తిమాన్ అని పిలుస్తుండగా, కొందరు రజనీకాంత్ అని పిలుస్తున్నారు.

READ MORE: Chandrababu: మోడీపై బాబు ప్రశంసలు.. ఆయన లాంటి పవర్‌ ఫుల్‌ వ్యక్తిని చూడలేదు..

ఈ 19 సెకన్ల వైరల్ వీడియోలో.. బస్సు వెనుక భాగంలో కండక్టర్ ఇద్దరు ప్రయాణీకులకు టిక్కెట్లు ఇస్తున్నాడు. ప్రయాణీకులలో ఒకరు అకస్మాత్తుగా తన బ్యాలెన్స్ కోల్పోయి, బస్సు తలుపు వైపు తడబడటం ప్రారంభించాడు. డోర్ కూడా తెరుచుకుంటుంది. అయితే బస్సు కండక్టర్, చురుకుదనం చూపిస్తూ.. వెంటనే ప్రయాణీకుడి చేయి పట్టుకుని..తనిని తన వైపుకు లాగాడు. కింద పడకుండా కాపాడాడు. ఈ ఘటన మొత్తం బస్సులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

ఈ వీడియో జూన్ 7న ఓ ఖాతా నుంచి “X”లో భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. 30 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై జనాలు చాలా కామెంట్లు చేస్తున్నారు. బస్ కండక్టర్ ఇంత అప్రమత్తంగా ఉంటాడంటే నమ్మలేమని కొందరు అంటున్నారు. కొందరు ఫన్నీ వ్యాఖ్యలు చేసారు.