NTV Telugu Site icon

Deccan Mall Fire Accident: సికింద్రాబాద్‌ ఘటన.. మొదటి అంతస్తులో అస్థిపంజరం గుర్తింపు

Deccan Mall Fire Accident

Deccan Mall Fire Accident

Deccan Mall Fire Accident: సికింద్రాబాద్‌ ప్రాంతంలోని రామ్‌గోపాల్‌పేట్‌లో ఉన్న డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్టు సర్క్యూ్ట్ కారణంగా మంటలు చెలరేగాయి. తర్వాత ఆ మంటలు పై అంతస్తులోని స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. పక్కన ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. స్పోర్ట్స్ షోరూం మొదటి అంతస్తులో పూర్తిగా కాలిన ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవదహనమైనట్లు తెలుస్తోంది.

ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మంటల సమయంలో దుకాణంలో ఉన్న తమ వస్తువులను తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ప్రమాదంలో ముగ్గురూ చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఆ ముగ్గురిలో ఈ అస్థిపంజరం ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది. పొగ వల్ల రెండ్రోజులుగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈరోజు మరోసారి పొగలు ఆర్పివేసి.. లోపలికి వెళ్లి పరిశీలించగా ఓ వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. మిగతా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.

Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..

సికింద్రాబాద్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటన సంచలనం రేపింది. 5 అంతస్తుల భవనం, పెంట్‌హౌజ్‌లో డెక్కన్‌ నైట్‌వేర్‌ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమంగా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది 22 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు శ్రమించి.. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి…. సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద వారిని కాపాడారు.