Site icon NTV Telugu

Kishan reddy: సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి విజయం.. ఎంత మెజార్టీ అంటే..!

Kdke

Kdke

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 10,42,493 ఓట్లు పొలైయ్యాయి. కిషన్‌రెడ్డికి 4,72,012 ఓట్లు వచ్చాయి. మొత్తం 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Narendra Modi: హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రధాని మోడి.. కాకపోతే మెజారిటీ..

రెండోసారి ఆశీర్వదించి గెలిపించిన ఓటర్లకు కిషన్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. కేంద్ర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Konda Surekha: కక్షపూరితమైన పాలన తోనే జగన్ పరాజయం.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

Exit mobile version