NTV Telugu Site icon

Atiq Ahmed: సీఎం యోగి నివాసానికి భద్రత పెంపు.. యూపీలో 144 సెక్షన్

Yogi

Yogi

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్ లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే.. ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Also Read : Sudan: సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య అధికార పోరు.. 56 మంది మృతి

ప్రయాగ్ రాజ్ లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ల హత్య జరగ్గానే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ అయ్యారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ లో అల్లర్లను ఎదుర్కొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రయాగ్ రాజ్ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రొవిన్షయల్ ఆర్మ్ డ్ కాన్ స్టబులరీ( పీఏసీ), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించింది. దీంతో అతీక్ అహ్మద్ సోదరుల హత్య తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను భారీగా పెంచారు. ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

Also Read : Nizamabad Hospital: ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన.. తల పట్టుకుంటున్న అధికారులు