NTV Telugu Site icon

AP Violence : చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్

144 Section

144 Section

ఏపీలో పోలింగ్‌ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 7కు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇరు పార్టీలలో 40 మందికి పైగా ముద్దాయిలను గుర్తించారు పోలీసులు… పులివర్తి నానిపై దాడి కేసులో ఇప్పటికే 13మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో బీఎస్ఎఫ్ జవాన్ 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. నానిపై దాడి సమయంలో మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర నాని గన్ మాన్ 2 రెండ్లు కాల్పులు జరిపారు. ఈ కమ్రంలోనే.. నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. అరెస్ట్ ల భయంతో కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వర్శిటీ వద్ద సీఐ పై దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. నేటి మధ్యాహ్నం నుంచి సిట్ బృందం విచారణ కొనసాగే అవకాశం ఉంది.