తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా నిన్నటి వరకు 4332 సర్పంచ్ స్థానాలకు 12479 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read:ఈ శీతాకాలంలో టూర్ ఎక్కడికి వెళ్లాలి? ఇండియాలోని బెస్ట్ వింటర్ స్పాట్స్ ఇవే !
38342 వార్డు మెంబర్ స్థానాలకు 30040 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులను ఏకగ్రీవం చేసుకునేందుకు పలువురు గ్రామస్థుల ఆసక్తి కనబరుస్తున్నారు. ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. పదవులకు వేలం పాటలు నిర్వహించడం, బలవంతపు ఏకగ్రీవాలు చేయొద్దని ఎస్ఈసీ సూచించింది.
Also Read:RGV: ఆర్జీవీ కొత్త సినిమా అప్డేట్.. రిలాక్స్ మోడ్‌లో సూపర్ స్టిల్..
తొలి విడత నామినేషన్ల స్వీకరణలో రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8198 నామినేషన్లు, 11502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించనున్నది. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను వెల్లడిస్తారు. మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3 నుంచి స్వీకరించనున్నారు.
