Site icon NTV Telugu

Bihar Assembly Elections 2025: బిహార్‌లో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

Bihar

Bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ జరుగనున్నది. రెండవ దశకు సంబంధించిన ఓటింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ దశ ఓటింగ్‌లో NDA, మహా కూటమి రెండింటికీ చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. ప్రచారం ముగియడంతో ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీ లేదా రోడ్ షోలపై పూర్తి నిషేధం ఉంటుంది. రెండవ దశలో ఓటింగ్ జరిగే 20 జిల్లాల్లో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, శివహార్, మధుబాని, సుపాల్, అరారియా, కిషన్‌గంజ్, పూర్నియా, కతిహార్, భాగల్‌పూర్, బంకా, జముయి, నవాడా, గయా, ఔరంగాబాద్, జెహానాబాద్, అర్వాల్, కైమూర్, రోహ్తాస్ ఉన్నాయి. బీహార్ లో మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి.

Also Read:Airplane Mode: ఫోన్ లో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉపయోగిస్తే.. కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

రెండవ దశలో, నవంబర్ 11న ఉదయం 7 గంటలకు 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ దశలో 1,302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1,165 మంది పురుషులు, ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 37,013,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశ కోసం మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 గ్రామీణ, 5,326 పట్టణ బూత్‌లు ఉన్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బీహార్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243. నవంబర్ 14 న ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు.

Also Read:Kolkata: కోల్‌కతాలో మరో ఘోరం.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై అకృత్యం

కాగా రెండవ దశ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా సాగిన అధికార “ఎన్.డి.ఏ” కూటమి, ప్రతిపక్ష “మహాఘఠ్ బంధన్” కూటమి నేతల ఎన్నికల ప్రచారం. నేడు ఆఖరి రోజు పలు ఎన్నికల ప్రచార సభల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాధ్ సింగ్, ఇతర బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు విస్తృత ప్రచారం చేశారు. మొత్తంగా “ఎన్.డి.ఏ”, బిజేపి తరపున విస్తృత ఎన్నికల ప్రచారం చేసిన అగ్ర నేతలు ప్రధాని మోడి, బిజేపి జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాధ్ సింగ్. అలాగే, “మహాఘఠ్ బంధన్” తరఫున విస్తృత ప్రచారం చేసిన ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభ లో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ముఖ్యనేత, ఎమ్.పి ప్రియాంక గాంధీ.

Exit mobile version