NTV Telugu Site icon

Seaplane: శ్రీశైలం టు విజయవాడ.. సీ ప్లేన్ ట్రయల్ రన్‌కు సర్వం సిద్ధం..

Seaplane

Seaplane

Seaplane: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో తొలి సీప్లేన్ సర్వీసులకు వేదికకా మారనుంది విజయవాడ.. ఇప్పటికే డీ హావిలాండ్‌ ట్విన్ అట్టర్ క్లాసిక్‌ 300 విమానం భారత్‌కు చేరుకోగా… నేడు శ్రీశైలం నుంచి విజయవాడ వరకు సీ ప్లేన్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు.. సీ ప్లేన్ ట్రయల్ రన్ కు సర్వం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.. శ్రీశైలం నుంచి విజయవాడకు ట్రయల్ రన్ జరగనుంది.. ప్రకాశం బ్యారేజీ వద్ద 500 మీటర్ల నుంచి రన్ వే ఏర్పాటు చేశారు.. రన్ వే పై 2 కిలో మీటర్లు వెళ్లనుంది సీ ప్లేన్.. 120 మీటర్ల వెడల్పు ఉండే రన్ వే 1120 మీటర్ల వద్ద ఒడ్డుకు మళ్లించారు.. ఒడ్డున జెట్టీ వద్ద ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు.. ప్రకాశం బ్యారేజీ వరకూ పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఇక, వీక్షకుల కోసం పున్నమి ఘాట్, దుర్గాఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు.. ట్రయల్ రన్ ప్రారంభ వేదిక వద్ద పూర్తిస్ధాయి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అహ్మదాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే సీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు..

Read Also: AHA : జనక అయితే గనక గోల్డెన్ అఫర్

ఇక, తొలి ట్రయల్ సర్వీసును విజయవాడ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తారు. డీహెచ్‌సీ 6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 సేవల్ని దేశంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. కాగా, భారత్‌లో నాలుగేళ్ల క్రితమే గుజరాత్‌లో సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించిన విషయం విదితమే.. ఇక, డీహెచ్‌సీ క్లాసిక్ 300 ఎయిర్‌ క్రాఫ్ట్‌ అహ్మదాబాద్‌ నుంచి దేశంలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించే నగరాల్లో పర్యటిస్తుంది. మొదట విజయవాడలో ల్యాండ్ కానుంది.. ఆ తర్వాత మైసూర్, లక్షద్వీప్‌లకు ప్రయాణించనుంది..

Show comments