మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి రక్షించింది SDRF టీం. సురక్షితంగా బయటపడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు రైతులు. తిరిగి వస్తారు అనుకోలేదు అంటూ బోరున ఏడ్చారు కుటుంబ సభ్యులు. ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబాలు పోలీసులు, SDRF సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Siddipet: వాగులో చిక్కుకున్న రైతులను రక్షించిన SDRF టీం.. కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగం
- వాగులో చిక్కుకున్న రైతులను రక్షించిన SDRF టీం
- కుటుంబ సభ్యులను హత్తుకొని భావోద్వేగం

Siddipet