Ram Mandir Special: జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో రామాలయం అనేది ప్రతీ హిందువు కల.. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం.. అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన దివ్య రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు సిద్ధమైంది.. ప్రతీ రామ భక్తుడు ఆ వేడుకను ఓ పండుగా తిలకిస్తున్నాడు.. ఇక, లోకాభిరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఊరూరా పండుగ వాతావరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.. ప్రతీ హనుమాన్, రామాలయాలను ముస్తాబు చేశారు.. పూలు, కాషాయ జెండాలు, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి.. ఇంటింటా దీపాలు వెలిగించి రాములోరికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు..
Read Also: Saikata Sculpture of Lord Rama: రంగంపేటలో ఆకట్టుకుంటున్న శ్రీరాముని సైకత శిల్పం
అయోధ్యలో బాల రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఆ వేడుకను పురస్కరించుకుని.. ఒక్కొక్కరు.. ఒకలా రాముడిపై తమకు ఉన్న భక్తిని, అభిమానాన్ని చాటుతున్నారు.. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. సముద్ర గర్భంలోనూ శ్రీరాముడు చిత్రపటాలను పెడుతున్నారు.. దీంతో సముద్ర గర్భాన్ని కూడా శ్రీ రాముడు ఫీవర్ తాకినట్టు అయ్యింది.. విశాఖలో స్కూబా డైవింగ్ బృందం వినూత్న ప్రయత్నం చేసింది.. ఋషికొండ సముద్రపు లోతుల్లోకి శ్రీరాముడి విగ్రహంతో వెళ్లింది స్కూబా డైవింగ్ టీమ్.. సముద్రపు లోతుల్లో శ్రీరాముడి చిత్రపటాన్ని ప్రదర్శించి ఔరా..! అనిపించారు.