NTV Telugu Site icon

SCO Summit 2024: పాకిస్తాన్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న భారతదేశ విదేశాంగ మంత్రి.. ఫోటో వైరల్

Jayshankar

Jayshankar

SCO Summit 2024: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO సమ్మిట్ 2024)లో పాల్గొనడానికి భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌ లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో అధికారిక సమావేశాలతో పాటు జైశంకర్ ఖాళీ సమయాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. జైశంకర్ బుధవారం (16 అక్టోబర్ 2024) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ చిత్రాన్ని పంచుకున్నారు. X లో ఫోటోను పంచుకుంటూ, “మా హైకమిషన్ ప్రాంగణంలో భారత్-పాకిస్తాన్ దేశాల సహచరులతో మార్నింగ్ వాక్” అంటూ రాసుకొచ్చారు.

Womens T20 World cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న జట్లు ఇవే..

ఇకపోతే నేడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ 2024 రెండవ రోజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్‌ లోని జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లో స్వాగత ప్రసంగం చేస్తారు. కార్యక్రమం గ్రూప్ ఫోటోతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధాని షరీఫ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. షెహబాజ్ షరీఫ్ స్వాగత ప్రసంగం తర్వాత, సెషన్‌లో పలు పత్రాలపై సంతకాలు జరుగుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, SCO సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్ మీడియాతో ప్రసంగిస్తారు. ఈ సెషన్ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక లంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో GDS డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

ఇకపోతే ఈ సదస్సులో భారతదేశం, చైనా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరితోపాటు ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు, మంగోలియా ప్రధాని పాల్గొన్నారు. మంత్రివర్గం డిప్యూటీ చైర్మన్, తుర్క్‌మెనిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. నేటి సెషన్‌లో ఆర్థిక సహకారం, వాణిజ్యం, పర్యావరణ సమస్యలు ఇంకా సామాజిక-సాంస్కృతిక సంబంధాలపై చర్చ జరుగుతుంది.